రిచాకు పెళ్లి కళ వచ్చేసింది

గ్లామర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతోంది. తన ప్రియుడు జోనుతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రిచా ప్రకటించింది. తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ‘జోను నాకు బిజినెస్ స్కూల్ పరిచయం. రెండు సంవత్సరాలు అద్భుతంగా గడిచింది. ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది. నా జీవితంలోని అందమైన ఘట్టం కోసం ఎదురుచూస్తున్నాను’ అని పోస్ట్ చేసింది. ‘లీడర్’ చిత్రంతో హీరోయిన్‌గా పరియమైన రిచా ఆ తర్వాత ‘నాగవల్లి’, ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’, ‘భాయ్’ సినిమాల్లో తన అందచందాలతో, అభినయంతో ఆకట్టుకుంది. వీటితోపాటు తమిళ్, బెంగాలీ సినిమాల్లో కూడా నటించింది. వివాహం తర్వాత సినిమాల్లో నటించే ఉద్దేశం రిచాకు లేదట.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article