ఆర్కే వర్సెస్ లోకేష్ ..ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

RK VS Lokesh

మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి, నారా లోకేష్ కు మధ్య వివాదం తారస్థాయికి చేరింది. నిన్నటికి నిన్న పార్టీ సోషల్ మీడియా విభాగము లోకేష్ టీం నుండి తనకు ప్రాణహాని ఉందని ,తనను ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా టీడీపీ నేతలు సైతం తమ నాయకుడు లోకేష్ కు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్‌కు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల వల్ల లోకేష్‌కు ప్రాణహానీ ఉందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు జంగాల సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు తమ నాయకుడు అయిన నారా లోకేష్ పై మంగళగిరి వైసిపి నేతలు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, మాజీ సిఎం చంద్రబాబుపైనా , నారా లోకేష్‌పైనా పప్పు, దొంగ అని మాట్లాడుతున్నారని, అంతేకాకుండా బెదిరింపులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కె అనుచరులు, వైసిపి నాయకుల వల్ల నారా లోకేష్‌కు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టిడిపి నేతలుపేర్కొన్నారు.
నిన్నటికి నిన్న మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించారు అన్న అక్కసుతో టీం లోకేష్ సభ్యుడు నాని చౌదరి తనను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలో ఎలా బతుకుతారో చూస్తామని తనను హెచ్చరిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు వైయస్ జగన్ను జైలుకు పంపిస్తామని, తనను మంగళగిరి నుండి తరిమి కొడదామని ఫోను చేసి బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి ప్రజలు తరిమి కొట్టిన లోకేష్ కు బుద్ధి రాలేదని, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనను బెదిరింపులకు గురి చేసిన భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.ఇక లోకేష్ పైన ఫిర్యాదు ఆర్కే చేయగా , టిడిపి నాయకులు ఆర్కే అనుచరులతో నారా లోకేష్ కు ప్రాణహాని ఉందంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో తిరిగి ఫిర్యాదు చేశారు.

RK VS Lokesh

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article