రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

65
road accident in nalgonda
road accident in nalgonda

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం స్టేజి వద్ద వెనుకనుంచి ట్రాన్స్పోర్ట్ డీసీఎం కారును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొకరు పరిస్థితి విషమంగా ఉండటంతో నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది వీరంతా హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్ ఒంగోలుకు వెళుతున్నారనే ప్రాథమిక సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం హైవేపై ఆగి ఉన్న ట్రాఫిక్ ని క్లియర్ చేస్తుండగా మరొక లారీ వచ్చి మరో కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య ఆరుకిచేరిందని కట్టంగూరు ఎస్ఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here