బొలెరోను ఢీకొట్టిన లారీ.. 3 మృతి

శాయంపేట మండలం మందారపేట కస్తూర్బా పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. శాయంపేట మండలం పత్తిపాక నుంచి మొగుళ్లపల్లికి మిరపతోట పనులకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బొలేరోలో మొత్తం 25 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మంజుల (45), రేణుక (48), విమల (50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article