ఐదొందల నోటుతో ఏమార్చి.. లక్షన్నర దోచేశారు.

ఐదు వందల రూపాయల నోటుతో ఓ వ్యక్తిన ఏమార్చిన ఇద్దరు దుండగులు.. అతడి వద్దనున్న రూ.లక్షన్నర నగదును దోచేసి పారిపోయారు. మైసూరు జిల్లా కేఆర్ నగర్ లో గురువారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. హుణసూరులోని కల్కుణికె గ్రామానికి చెందిన గణేశ్ అనే వ్యక్తి కేఆర్ నగర్ లో ఉన్న నగర అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులో గురువారం రూ1.50 లక్షలు డ్రా చేశాడు. అనంతరం సీఏ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఆగి టీ తాగుతున్నాడు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. రూ.500 నోటు కింద పడేశారు. ఆ నోటు మీదేనా? అని గణేష్ దృష్టి మరల్చారు. అతడు కిందకు వంగి నోటు తీసుకుంటుండగా.. గణేష్ చేతిలో ఉన్న నగదు సంచి లాక్కుని బైక్ పై ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article