సత్యమే గెలుస్తుందని రాబర్ట్ వాద్రా సంచలనం

Robert Vodra Sensational Comments – మనీల్యాండరింగ్ కేసు..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోమారు తెరపైకి వచ్చిన మనీ ల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై విచారణ వేగవంతం చేసారు ఈడీ అధికారులు .ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త , వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా అన్నారు. లండన్‌లో అక్రమాస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలపై ఈడీ ఆయనను విచారిస్తున్న సంగతి తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసులో వాద్రాను ఈనెల 6, 7 తేదీల్లో విచారించిన ఈడీ శనివారం మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది.
దీంతో ఈడీ విచారణపై తొలిసారి ఆయన పెదవి విప్పారు. తానెలాంటి తప్పూ చేయలేదని వాద్రా మరోసారి స్పష్టం చేశారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని ఆయన ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘శుభోదయం.. ముందుగా నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ధైర్యంగా, క్రమశిక్షణతో దేన్నైనా ఎదుర్కొంటాను. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. మీ అందరికీ ఆదివారం శుభం జరగాలని, హెల్తీ వీక్ కావాలని కోరుకుంటున్నాను’ అని రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. వాద్రా లండన్‌లో వరుసగా 5 మిలియన్ పౌండ్లు, 4 మిలియన్ పౌండ్ల విలువ చేసే రెండు ఇళ్లను, ఆరు ఫ్లాట్స్, ఇతర ఆస్తులను కొనుగోలు చేశారని, వీటిలో కొత్తగా చేజిక్కించుకున్న ఆస్తులు సైతం ఉన్నాయని ఢిల్లీ కోర్టుకు ఈడీ నివేదించింది.
ఈ కేసులో వాద్రాను ఫిబ్రవరి 16 వరకూ అరెస్టు చేయకుండా పాటియాలా హౌస్ కోర్టు ఈనెల 2న తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయితే తనకు విదేశాల్లో అక్రమాస్తులు లేవని, రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా మరో వివాదంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్రా ఈ నెల 12న జైపూర్‌లో మరోసారి ఈడీ ఎదుట హాజరవుతారని తెలుస్తోంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article