రోహిత్, కోహ్లీ అర్థసెంచరీలు

ROHIT, KOHLI GOT 50S

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. 244 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. రోహిత్ శర్మ 62 నాటౌల్ (72 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ 50 నాటౌట్ (59 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్థసెంచరీలు సాధించడంతో 27 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 144 పరుగులు చేసింది. ఇంకా 23 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. 39 పరుగుల వద్ద శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. 27 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసిన ధావన్.. బౌల్ట్ బౌలింగ్ లో టేలర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌.. 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు సాధించగా.. హార్దిక్‌ పాండ్యా, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article