టీడీపీ నేతలపై రోజా ఫైర్

Roja Fired on TDP Leaders

జగన్ తో కేటీఆర్ భేటీ ఏపీలో చంద్రబాబును ఎదుర్కోటానికే అని తెలుగు తమ్ముళ్లు పలు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా టిడిపి నాయకుల పై ఫైర్ అయ్యారు. టిడిపి నేతలకు పొత్తులకు, చర్చలకు మధ్య తేడా తెలియదని రోజా మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము సైతం కలిసి వచ్చే పార్టీలతో పనిచేస్తామని దానికోసం అనవసరపు రాద్దాంతం చేయడం టిడిపికి అలవాటైపోయిందని ఆమె ఫైర్ అయ్యారు.

పొత్తులకు, చర్చలకు తేడా తెలియకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేఆర్‌కే రోజా ఎద్దేవా చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తుంటే టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న మంత్రులు గతంలో కేసీఆర్ విజయవాడ వచ్చినప్పుడు ఎలాంటి రాచ మర్యాదలు చేశారో గుర్తుకు తెచ్చుకోవాలంటూ ఆమె సూచించారు. దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు ఇద్దరు యువ నాయకులు చర్చలు జరిపితే టీడీపీలోని నాయకులంతా కంగారు పడుతున్నారంటూ రోజా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం చంద్రబాబు, టీడీపీ పార్టీ కారణంగానే తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏది చేసిన బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నాయకులపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

roja latest news

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article