బాబుపై రోజా పంచ్

ROJA PUNCHES ON CBN

చంద్రబాబుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మండిపడ్డారు. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. ప్రజలు ఛీకొట్టేలా సభలో టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన రోజా ఏపీ బడ్జెట్ చూసి చంద్రబాబుకు దిమ్మ తిరిగింది అంటూ సెటైర్లు వేశారు. బడ్జెట్ పై మాట్లాడలేక చంద్రబాబు నాయుడు పారిపోయారంటూ విమర్శించారు.

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏనాడైనా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఘాటుగా విమర్శించారు. వాయిదా తీర్మానం దేనిపై పెట్టాలో కూడా టీడీపీకి తెలియడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు ప్రస్తుతం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ సంఖ్యను మూడుకు తగ్గించుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలందరూ బీజేపీలో కలిసిపోతున్నారని ఇలాగే ప్రవర్తిస్తే ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో పయనిస్తారని రోజా పంచ్ లు వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు..అదే విధంగా టీడీపీ నేత‌ల మీద కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. వైసీపీ నేత లు దాడులు ఎక్కువ‌గా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మీద పంచ్‌లు వేసారు. క‌న్నా మీద గ‌తంలో టీడీపీ శ్రేణులు దాడుల‌కు ప్ర‌య‌త్నించిన తీరు..అదే విధంగా బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా మీద దాడికి ప్ర‌య‌త్నించిన తీరు మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. స‌భ‌లో బ‌డ్జెట్ మీద మాట్లాడేందుకు అంశం లేక చంద్ర‌బాబు పారిపోయార‌ని విమ‌ర్శించారు. అచ్చెన్నాయుడు..బుచ్చ‌య్య చౌద‌రి గ‌త అసెంబ్లీలో వ్య‌వ‌హ‌రించి తీరు మ‌ర్చిపోయిన‌ట్లున్నార‌ని..వారి భాష‌ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకున్నార‌ని పేర్కొన్నారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article