రీ షూట్ కు వెళుతోన్న ఆర్ఆర్ఆర్..?  

139
RRR Bad Ouput-Rajamouli Doing Re-Shoot
RRR Bad Ouput-Rajamouli Doing Re-Shoot

RRR Bad Ouput-Rajamouli Doing Re-Shoot

ఇండియన్ స్టార్ డైరెక్టర్ రజామౌళి తాజా సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత వస్తోన్న సినిమా కావడంతో పాటు తెలుగులో ఇద్దరు టాప్ హీరోలతో చేస్తోన్న మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ వాటిని పెంచడంలో రాజమౌళి బాహుబలిలా సక్సెస్ కాలేదు ఇప్పటి వరకూ. ఎందుకంటే ఈ మూవీ ప్రారంభం అయి యేడాది దాటినా ఇంకా ఒక్క లుక్కు కూడా వదల్లేదు. నిరంతరం సినిమా పోస్ట్ పోన్ గురించి వార్తలు తప్ప ఏ అప్డేటూ లేదు. ఇక రీసెంట్ గా సినిమా ఏకంగా ఆరు నెలల పాటు పోస్ట్ పోన్ కావడంతో అసలేం జరుగుతుందనేది ఆడియన్స్ లోనే కాదు.. ఫిల్మ్ సర్కిల్స్ లోనూ ఓ కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఈ సినిమా వాయిదా పడటానికి ఫస్ట్ టైమ్ రాజమౌళి అంచనాలు తప్పడమే కారణం అంటున్నారు.

ముందే చెప్పినట్టుగా ఆర్ఆర్ఆర్ జూలై 30న విడుదల కావాలి. ఇప్పుడు 2021 జనవరి 8కి వెళ్లింది. ఇంత లాంగ్ గ్యాప్ రావడానికి కారణం సినిమా అనుకున్నట్టుగా రాలేదట. యస్.. ఇది నిజమే. మొదటి సారిగా రాజమౌళి తన అంచనాలకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కినట్టు గుర్తించాడట. మామూలుగా ప్రతి సీన్ విషయంలో పక్కాగా ఉంటాడు రాజమౌళి. కానీ ఇది కాస్త ఫిక్షనస్ పీరియాడిక్ మూవీ కావడంతో కొన్ని విషయాల్లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాడట. ఆ కారణంగానే రెండు షెడ్యూల్స్ కు పైగా రీ షూట్ చేయాల్సి వస్తోందట. అందుకే అంత దూరం విడుదల వాయిదా వేయాల్సి వచ్చిందని వినిపిస్తోంది.

నిజానికి అంతా అనుకుంటున్నట్టు ఈ చిత్రానికి బాహుబలిలా ఓ రేంజ్ లో గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. మాగ్జిమం రియలిస్టిక్ లొకేషన్స్ లోనే చిత్రీకరణ చేశారు. అయినా వాయిదా పడిందంటే కారణం.. సినిమా అనుకున్న స్థాయిలో అస్సలు రాలేదనే అంటున్నారు. మొత్తంగా ఇంకా మూడు నెలల పాటు జరిగే షూటింగ్ అంతా పూర్తిగా రీ షూటే అనే పుకార్లు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ యేడాది మే నెల వరకూ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కే పరిమితం కావాలనే ఆంక్షలు కూడా వచ్చేశాయట.రీ షూట్ జరిగితే జరిగింది కానీ ఇన్నాళ్ల టైమ్ ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలకు షాక్ లేకుండా చూసుకో జక్కన్నా..

RRR Bad Ouput-Rajamouli Doing Re-Shoot,#Rajamouli,#RRR,RRR in Reshoot Mode,Why RRR release delayed,RRR Movie Repairs

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here