RRR CHARAN LOOK
బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈయన దర్శకత్వంలో ఏ సినిమా రానుందోనని అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ధీటుగా ఎన్టీఆర్, రాంచరణ్‌లతో రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` సినిమా చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ భట్, అతిథిపాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారని సమాచారం. కాగా..ప్రస్తుతం సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమాలో రాంచరణ్ లుక్‌ను మార్చి 27న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారని వినికిడి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.
For More Click Here
More Latest Interesting news