ఆర్ఆర్ఆర్ అప్ డేట్ ఇదే!

61
RRR Update Released
RRR Update Released

RRR Update Released

ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం) టైటిల్ వింటేనే చాలా ఆసక్తిగా ఉంది. అందుకే ఈ సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ప్రేక్షుకులు వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెండు రోజుల నుంచి ఆర్.ఆర్.ఆర్ కు మరో అప్ డేట్ రానుందని టీం ప్రకటించింది. ప్రేక్షకులు ఏంటో ఆ అప్ డేట్ అని ఆసక్తి ఎదురుచూశారు. అప్‌డేట్ సమయం వచ్చింది అంటూ ఒక మేకింగ్ వీడియోను తీసుకొచ్చింది. అక్టోబరు  22న “రామరాజు ఫర్ భీమ్” కోసం ఎదురుచూడమని తెలిపింది. మరో ఉత్కంఠకు తెరతీసింది. అక్టోబరు 22 రామ్ చరణ్ వాయిస్ తో ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ కానుంది.

అన్ని బాషల అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం). బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాగా  తెరకెక్కుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. మళ్లీ షూటింగ్ కొనసాగించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here