ఆర్ఆర్ఆర్.. మళ్లీ మొదటికే వచ్చింది..

84
RRR update
RRR update

RRR update

ఆర్ఆర్ఆర్.. భారీ హైప్ తో మొదలైన సినిమా. కానీ అది స్టార్ట్ అయిన పాయింట్ సరిగా లేదేమో.. అందుకే ఆరంభం నుంచి అన్నీ అవాంతరాలే. మొదటి రామ్ చరణ్ కు, తర్వాత ఎన్టీఆర్ కు చిన్న యాక్సిడెంట్స్ అయ్యాయి. అటుపై వరదలు వచ్చాయి. కట్ చేస్తే కరోనా వచ్చింది. దీంతో కరోనాకు ముందే సినిమా విడుదలను సంక్రాంతికి వాయిదా వేశారు. బట్ ఇప్పుడు కరోనా అనుకున్న దానికంటే ఎక్కువ కాలం ప్రభావం చూపించడంతో సంక్రాంతికి విడుదల కావడం అసాధ్యం అని తేలిపోయింది. దీంతో ఆర్ఆర్ఆర్ కథ మళ్లీ మొదటికి వచ్చింది.
బాహుబలి వంటి ఎపిక్ పార్ట్స్ తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడంతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాసివ్ హీరోలు.. అలాగే తెలుగు పోరాట యోధులైన కొమురమ్ భీమ్, అల్లూరి సీతారామరాజుల కథల నుంచి ఇన్స్ స్పైర్ అయిన కథ అని చెప్పడంతో అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరూ నార్త్ పీపుల్ కు తెలియకపోయినా.. తనదైన శైలి ఎమోషన్స్ తో ఎలాగూ రాజమౌళి వారినీ మెప్పిస్తాడు. ఇక హీరోయిన్లు కూడా అందుకు తగ్గట్టుగానే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్యూటీస్ ను తీసుకున్నాడు.

ఎంత హైప్ ఉంటే ఏం లాభం.. అసలు షూటింగే జరగనప్పుడు అనేది ఈ సినిమాకు ఉన్న ప్రధాన మైనస్ పాయింట్ అయిందిప్పుడు. మొత్తంగా అయిన ఆలస్యాలన్నీ వదిలేసిన మొదట వీరు ఏ తేదీ ప్రకటించారో.. అదే తేదీకి ఒక యేడాది ఆలస్యంగా రౌద్రం రణం రుధిరం విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే అన్నీ సరిగ్గా కుదిరి ఉంటే ఈ సినిమా ఈ యేడాది జూలై 30న విడుదలై ఉండేది. కానీ వీలు కాలేదు కాబట్టి 2021 జూలై 30న విడుదల చేయాలనుకుంటున్నారు. నిజానికి ఇది సేఫ్ డేటే. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆగిపోయిన సినిమాలన్నీ సమ్మర్ లోనే దాడి చేస్తాయి. సమ్మర్ వేడి కాస్త తగ్గాక రాజమౌళి వంటి దర్శకుడు సినిమా వస్తే మాన్ సూన్ కూ మంచి ఊపొస్తుంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ఆగిపోయిన దగ్గరే మొదలు కాబోతోందన్నమాట.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here