ఊడిపోయిన ఆర్టీసీ బస్సు చక్రాలు

తెలంగాణలోని యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగింది. రన్నింగ్‌లో ఉండగానే ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి. బస్సు డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 40మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి తొర్రూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article