RTC Charges Hiked For Medaram Jatara
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం జాతరకు సమయం దగ్గర పడుతుంది . రెండోళ్లకోసారి వచ్చే ఈ జాతరను.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తూ వస్తోంది.అయితే.. తాజాగా మేడారం జారతకు ఏర్పాటు చేసిన బస్సుల ఛార్జీలను పెంచింది ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి మేడారానికి వెళ్లాలంటే ఏసీ బస్సుకు రూ.710, సూపర్ లగ్జరీ బస్సుకు రూ. 550, ఎక్స్ప్రెస్ ఛార్జీ బస్సుకు రూ. 440 వసూలు చేయనున్నారు. అలాగే ఇక సమీప ప్రాంతాల బస్సులోనూ టికెట్ ధర రూ. 30 నుంచి రూ. 50 వరకూ పెంచారు. దీంతో ఈ సారి మేడారం వెళ్ళే భక్తులకు రవాణా చార్జీలు తడిసి మోపెడు కానున్నాయి.
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఈ మేడారం జాతరకు మారు మూల ప్రాంతాల ప్రజలందరూ తరలివెళ్తూంటారు. మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మలను అతిపెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తరించిపోతూంటారు. ప్రస్తుతం ఈ జాతరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. తెలంగాణ ఆర్టీసీ భక్తుల కోసం ఏకంగా 4 వేల బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా.. అక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అధికారులు పర్యావేక్షిస్తున్నారు. కాగా మేడారం జాతర వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమై.. 8వ తేదీ వరకు జరగనుంది. మొదటిరోజు అయిన ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.
రెండోవరోజున ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది.ఇక మూడవరోజు ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. నాల్గవరోజు ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.
RTC Charges Hiked For Medaram Jatara,medaram, sammakka , saralamma, medaram jathara , bus fares, increase, hyderabad, telangana