ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా

RTC Employees Fires On Hayathnagar Corporator

హయత్ నగర్ డిపో దగ్గర టీఆరెస్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాకి డ్రెస్ లో డిపోకు వచ్చిన కార్పొరేటర్ ని ఆర్టీసీ కార్మికులు వెనక్కి పంపుతూ నినాదాలు చేశారు. 54 రోజులు పాటు మేము సమ్మె చేస్తుంటే ఏనాడు కష్టాలను తెల్సుకొని నువ్వు నేడు ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కార్మికుల ఆగ్రహంతో సదరు కార్పొరేటర్ వెనక్కి.వెళ్లిపోవాల్సి వచ్చింది. అనంతరం సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు చెప్తూ నినాదాలు చేశారు. ఇక ఆర్టీసీ రాకతో డిపోలు కళకళ లాడుతున్నాయి. ఇన్నాళ్ళు బస్సులు లేక కష్టాలు పడ్డ ప్రయాణికులు నేటి నుండి బస్సు సర్వీసులను వినియోగించుకుంటున్నారు.

RTC Employees Fires On Hayathnagar Corporator,tsrtc,hayathnagar rtc employees,cm kcr.telangana rtc,corporator tirumal reddy,hayathnagar corporator,tirumal reddy go back,rtc fires on tirumal reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *