ఆర్టీసీ సమ్మె కేసు 11 కు వాయిదా

RTC strike postponed to November 11
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ సరిగ్గా 34 రోజులు కావొస్తుంది. అయినప్పటికీ అటు ప్రభుత్వం కానీ  ఇటు కార్మికులు కానీ వెనక్కి తగ్గడంలేదు. దీనితో సమ్మె కి ముగింపు  దొరకడంలేదు. అలాగే ఈ సమ్మె పై హైకోర్టు  తాజాగా నేడు మరోసారి విచారణ చేపట్టింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టు తెలిపింది. అయితే ప్రభుత్వం ఆర్టీసీ చిత్త శుద్ధితో ముందుకు రావట్లేదని చెప్పింది. జీహెచ్ఎంసీ ఆర్టీసీ ఆర్థిక శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా లెక్కలు చెబుతున్నారని ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని పేర్కొంది. తమతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. మీ సమాచారంతో సీఎం కేబినెట్ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా అని నిలదీసింది.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయ స్థానం తప్పు బట్టింది. ఐఏఎస్ అధికారులే హైకోర్టుకు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా అంటూ ప్రశ్నించింది.ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పై సీరియస్ అయ్యింది. ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే… కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయన్న విషయాన్ని విస్మరించొద్దని పేర్కొంది. తప్పుడు నివేదికలు ఇస్తే సహించమని తేల్చి చెప్పింది. అటు ప్రభుత్వానికి , ఇటు ఆర్టీసీకి చీవాట్లు పెట్టింది. 11వ తేదీలోపల సమస్య పరిష్కరించక పోతే… తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది.
tags :  tsrtc strike, rtc strike, rtc jac, telangana government,  court, CM KCR, RTC MD, Sunil sharma, finance department, cs ramakrishna rao, hearings, reports
http://tsnews.tv/suresh-is-not-dead-says-rmo/
http://tsnews.tv/dera-baba-daughter-got-bail/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *