తెలంగాణా కోరుకుంది ఇందుకేనా 

RTC workers fire on governament

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం వివిధ ఉద్యోగాల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవర్, కండక్టర్, మెకానికల్ సూపర్‌వైజర్లు, మెకానిక్, శ్రామిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్, క్లరికల్ సిబ్బంది, ఐటీ ట్రైనర్ తదితర పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.ఒకపక్క సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నాడు . ఇక హైదరాబాద్ రాణీగంజ్ లో సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు . ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు మనస్తాపంతోనే ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీంతో తనువూ చాలించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు బోరున రోదిస్తున్నాయి. ఇందుకోసమా తెలంగాణా రాష్ట్రం కోరుకుంది అని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో కష్టాలు తీరతాయి అనుకుంటే స్వపరిపాలనలో నిరంకుశ విధానాలే అమలు అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ తమ కన్నీళ్ళకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

tags : tsrtc , rtc strike, cm kcr, rtc workers jac , rtc workers families

కేసీఆర్ బాటలో పొంగులేటి సహస్ర చండీ యాగం

హుజూర్ నగర్ ఉప ఎన్నికల  ప్రచారానికి మంత్రి హరీష్ రావు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *