చేస్తోందేమో పాన్ ఇండియా సినిమా. కానీ మొదట ఈ సినిమా కోసం మొదట ఓ చిన్న హీరోయిన్‌ని ఖాయం చేశాడు వెంకటేష్. ఆ వివరాల్లోకి వెళితే… వెంకీ కథానాయకుడిగా హిట్ సినిమా ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో`సైంధవ్` అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఓ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది.వెంకీ పోలీస్ అదికారిగా కనిపిస్తారని సమాచారం.ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారట. ఓ హీరోయిన్‌గా రుహానీ శర్మని ఖాయం చేశారు.రుహానీ ఇప్పటిదాకా చిన్న సినిమాలతోనే సందడి చేసింది.`చి కుం సౌ` లాంటి ఒకట్రెండు చిత్రాలతో మంచి పెర్‌ఫార్మెర్ అనే పేరైతే ఉందికానీ… ఆమె ఖాతాలో అదిరిపోయే హిట్లేమీ లేవు.మరోసారి ఆమెకి నటనకి ప్రాధాన్యమున్న పాత్రతోనే ఈ ఆఫర్ అందినట్టు సమాచారం. మరో స్థానాన్ని మాత్రం స్టార్ భామతో భర్తీ చేయనున్నారని సమాచారం.మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేదే ఇప్పుడు కీలకంగా మారింది.ఈ సినిమా పలు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.