రూ. 25 వేల నుండి రూ. 25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ ఆరంభమైంది. తొలిరోజు 1309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేశారు. మొత్తం రూ.3 కోట్ల 27 లక్షల 91 వేల 186 ఖాతాలలో జమ అయ్యింది. ఈ నెల 30 వరకు ప్రక్రియ కొనసాగుతుంది. రూ.50 వేల రూపాయల లోపు గల రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తారని సమాచారం. రైతుబంధు నిధుల పంపిణీ మాదిరిగానే రుణమాఫీ నిధులు కూడా జమ అవుతాయట. రైతుల ఖాతాలలో జమయిన నిధులను బ్యాంకర్లు ఇతర పద్దుల కింద జమ చేసుకోవద్దని సూచన. రుణాలు మాఫీ అయిన రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.