RX 100 beauty on Nagarjuna Movie
తెలుగులో ఆర్.ఎక్స్ 100తో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది పాయల్ రాజపుత్. ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో రెండు చిత్రాలు.. తమిళంలో రెండు చిత్రాలు.. పంజాబీలో నాలుగు చిత్రాలు చేస్తూ .. చేతి నిండా అవకాశాలతో బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు మరో అవకాశం ఆమెను వరిచింది. కింగ్ నాగార్జున, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రం ` మన్మథుడు 2` చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ ఓ కీలక పాత్రలో నటించనుందనేది సమాచారం. ఆసక్తికరమైన మరో విషయమేమంటే ఇందులో మెయిన్ లీడ్‌గా మరో హీరోయిన్ నటించనుంది. త్వరలోనే నాగార్జున ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు.