ఆగష్టు 16 నుండి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ

50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేర ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఆగష్టు 15న సీఎం కేసీఆర్ లాంఛనంగా 50 వేల‌లోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారు. ఆగష్టు 16 నుంచే ఆరు లక్షల రైతుల ఖాతాల్లో 2006 కోట్లు జమ అవుతాయి. బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు‌ సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమయ్యేలా చూడాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లకు ఆదేశం.

రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవగానే ముఖ్య మంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు ఎస్.‌ఎం.ఎస్ వెళ్లాలని మంత్రి హరీశ్ రావు ఆదేశం. రైతు రుణ మాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని ఆ‌ సందేశంలో తప్పకుండా పేర్కొనాలి‌. సీఎం పేరున ఎస్ ఎం ఎస్ సందేశంతో పాటు సదరు బ్యాంకులు సైతం రైతులకు రుణ మాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలి. రైతుల ఖాతాల్లో జమ అయిన రుణ మాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద‌ జమ. చేయవద్దు. రైతుల కు ఇబ్బందులు‌ సృష్టించవద్దని‌ స్పష్టమైన ఆదేశం. రుణ మాఫీ లబ్దిదారులైన రైతుల ఖాతాలను జీరో చేసి కొత్త పంట రుణం ఇవ్వాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article