కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ప్రారంభమైన సహస్ర చండీ యాగం

Sahasra chandi Yagam in KCR FARM HOUSE

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన ‘‘మహారుద్ర సహిత సహస్ర చండీయాగం’’ ప్రారంభమైంది. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌లో జరగనున్న ఈ యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.కేసీఆర్ దంపతులు కాషాయ వస్త్రాల్లో యాగశాలకు చేరుకున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వారూపానందేంద్ర సరస్వతి, వేదపండితులు మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాప్రే, ఫణిశశాంక శర్మ తదితరుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు యాగం జరగనుంది.
సీఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్న తరుణంలో విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ని కలిసి యాగం గురించి చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ సక్సస్ కోసం, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం కోసం ఈ యాగం చేస్తున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ యాగానికి కెసిఆర్ విశిష్ట అతిథిగా జగన్ ను పిలుస్తున్నారు అని కూడా ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమమైనా యజ్ఞయాగాదుల తోనే ప్రారంభించే కెసిఆర్ రానున్న ఎన్నికల నేపథ్యంలో దేశంలో కీ రోల్ పోషించడం కోసం ఈ ప్రతిష్టాత్మకమైన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహించనున్నట్లు గా తెలుస్తోంది.
మొత్తం 300 మంది రుత్విక్కులు దీనిలో పాల్గొంటారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగేలా కేసీఆర్ యాగం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు యాగశాల వద్దకు సీఎం కుమార్తె కవితతో పాటు ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ చేరుకున్నారు. ఇక ఐదు రోజుల పాటు నిర్విఘ్నంగా ఈ యాగం జరగనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article