సాహోరే ప్రభాస్

SAHO SHOOTING PIC

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాపై సర్వత్రా విపరీతమైన ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్, పలు భాషలకు చెందిన టాప్ స్టార్స్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చిన సినీ ప్రేమికులు, ప్రభాస్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటిస్తున్న అరుణ్ విజయ్ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రభాస్, జాకీ ష్రాఫ్, లాల్ ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న సాహో సినిమాలో భారీ తారాగణం నటించడం విశేషం. సుజిత్ రెడ్డి దర్శత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముకేష్, జాకీ ష్రాఫ్.. మాలీవుడ్ నుంచి లాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

అరుణ్ ఒక ఫొటోను షేర్ చేస్తూ.. సాహో సెట్స్ నుంచి స్వీటెస్ట్ డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ సుజిత్ అని క్యాప్షన్ పెట్టారు. మరో ఫొటోలో అరుణ్ విజయ్ తో పాటు ప్రభాస్, జాకీష్రాఫ్, లాల్ ఉన్నారు. సెట్స్ లో ఇంతటి కూల్ పర్సన్ ని చూడలేదని జాకీ ష్రాఫ్ ని ఉద్దేశించి క్యాప్షన్ రాశారు. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

TELUGU CINIMA

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article