మ‌రింత ఆలస్యంగా `సాహో`

Sahoo Release May Be postponed ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’.  యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.  భారీ బ‌డ్జెట్‌తో తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌భాస్ పుట్టిన‌రోజు.. శ్ర‌ద్ధాక‌పూర్ పుట్టిన‌రోజున వారి వారి పాత్ర‌లు లుక్స్‌, మేకింగ్ వీడియోస్‌ను విడుద‌ల చేశారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా రాబోతున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్‌, నీల్ నితిన్ ముఖేష్‌, మందిరా బేడి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. భారీ తారాగ‌ణంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావించింది. కానీ అప్ప‌టికి కూడా సినిమా విడుద‌లైయ్యే అవ‌కాశాలు లేవ‌ని కాబ‌ట్టి సినిమాను ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నేది ఆలోచ‌న‌లుగా క‌న‌ప‌డుతున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ త్వ‌ర‌త్వ‌ర‌గా సినిమాలు చేస్తాడ‌ని అనుకుంటుంటే ఆల‌స్య‌మ‌వుతూ ప్ర‌భాస్ అభిమానుల‌కు మ‌రింత నిరీక్ష‌ణ ఏర్ప‌డుతుంది.

Latest Interesting Telugu News Tsnews

For More New 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article