సాయి ధరమ్ తేజ్ కి గాయాలు

MEGA STAR NEPHEW SAI DHARAM TEJ MET WITH AN ACCIDENT. SUDDENLY HE FELL DOWN FROM SPORTS BIKE @ MADHAPUR CABLE BRIDGE.

98
SAI DHARAM TEJ ACCIDENT
SAI DHARAM TEJ ACCIDENT

హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జ్ ఫై స్పోర్ట్స్ బైకుపై నుంచి కింద పడ్డట్లు తెలిసింది. దీంతో తను అపస్మారక స్థితిలోకి చేరుకున్నారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాద ప్రాంతానికి చేరుకున్నారు. చికిత్స కోసం సాయిధరమ్‌ తేజ్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా? అనే అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here