చిరంజీవి చెల్లిగా సాయి పల్లవి

sai pallavi in chiru movie

ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరాతో పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోయినా.. సంతృప్తి మిగిలిందన్న ఆనందంలో ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చేస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెలాఖరులో అమ్మడు పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ ఆచార్య షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక ఆచార్య తర్వాత మెగాస్టార్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టుకుంటున్నాడు. అయితే ఇవన్నీ రీమేక్ లే కావడం విశేషం. ఒకటి మళయాల మూవీ లూసీఫర్ కు రీమేక్. వివి వినాయక్ డైరెక్షన్ లో రాబోతోన్న సినిమా ఇది. మొదట్లో సుజిత్ అనుకున్నారు. కానీ అతని స్క్రిప్ట్ కు చిరంజీవి ఒప్పుకోలేదు. తర్వాత వినాయక్ ఎంటర్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత తమిళ్ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. ఇప్పటి వరకూ అన్నీ భారీ సినిమాలే చేసిన మెహర్ రమేష్ కు ఇప్పటి వరకూ ఒక్క హిట్టు  కూడా లేదు.

అయినా వేదాళం తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ తో మెగాస్టార్ ను ఒప్పించాడు. తమిళ్ లో శివ డైరెక్షన్ లో అజిత్ నటించిన ఈ చిత్రం సిస్టర్ సెంటిమెంట్ తో నడుస్తుంది. అక్కడ ఆ పాత్రలో సిస్టర్ గా నటించింది హీరోయిన్ లక్ష్మీ మేనన్. ఈ మూవీ తర్వాత అమ్మడికి హీరోయిన్ గా మళ్లీ ఛాన్సులు రాలేదు. అలాంటి పాత్రనే తెలుగులో సాయి పల్లవి చేయబోతోందనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. లేటెస్ట్ గా అది నిజమే అంటోంది మూవీ టీమ్. అయితే సాయి పల్లవిని వీళ్లు ఫైనల్ చేసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కానీ తను ఒప్పుకుందా లేదా అనేది తన సైడ్ నుంచి ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే తను ఒప్పుకోకపోతే మరీ ఇలా చెప్పరు కదా. అందుకే సాయి పల్లవి చిరంజీవి చెల్లి పాత్రలో నటించేందుకు ఒప్పుకునే ఉండొచ్చు. ఏదేమైనా కథా బలం ఉన్న సినిమాలతో సత్తా చాటుతోన్న సాయి పల్లవి ఇలా సడెన్ గా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రకు ఒప్పుకోవడం కొందరిని ఆశ్చర్యపరుస్తోన్నా.. కథలో తను కోరుకున్న మార్పులు కూడా జరిగి ఉండొచ్చు అంటున్నారు. మరి చిరంజీవి చెల్లెలి పాత్రలో సాయి పల్లవి ఎంతలా ఫిదా చేస్తుందో చూడాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *