మ‌హిళ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు ఎస్ఎల్‌జి …

122
sakhi Awarness program for Women
sakhi Awarness program for Women

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సు, సాధికారతను అందించేందుకు ఎస్​ఎల్​జీ ఆస్పత్రి కృషి
ఎస్​ఎల్​జీ ‘సఖి’ ఆధర్వంలో మహిళల ఆరోగ్యం, సమస్యల పరిష్కారానికి అవగాహన సదస్సు

హైదరాబాద్, జూలై 18, 2021:

నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైనా ఎస్​ఎల్​జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం బాచుపల్లిలోని హిల్ కౌంటీ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో మహిళల ఆరోగ్యం మరియు వారి శ్రేయస్సు కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్​ఎల్​జీ ‘సఖీ’ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవేర్​నెస్​ కార్యక్రమంలో ఎస్​ఎల్​జీ ఆస్పత్రి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ & ప్రసూతి వైద్యురాలు డాక్టర్ సువర్ణ రాయ్ మరియు కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణ కుమారి, ఎస్​ఎల్​జీ ఆస్పత్రిలోని సీనియర్ మెడికల్ సిబ్బంది కమ్యూనిటీ వాసులకు మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

సఖి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ప్రయత్నంతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్, రక్తహీనత, రుతు సంబంధిత సమస్యలతో పాటు తలెత్తే ఇతర అనారోగ్య పరిస్థితులను మహిళలు స్వతహాగా విశ్లేషించగలుగుతారు. దీంతో ఏదైనా సమస్యతో డాక్టర్​ వైద్యుడి వద్దకు వెళ్లేందుకు ముందు డాక్టర్​కు వివరించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ సందర్భంగా ఎస్​ఎల్​జీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ & ప్రసూతి వైద్యురాలు డాక్టర్ సువర్ణ రాయ్ మాట్లాడుతూ, కొన్ని విభాగాల్లో శుభ్రమైన పద్ధతులు లేకపోవడం గర్భాశయ క్యాన్సర్ వంటి అనారోగ్యాలకు దారి తీస్తుంది. మరియు చాలా మంది బాలికలు తెలియకుండానే ఈ సమస్యకు గురవుతారు. సమస్యను గుర్తించడంలో సహాయపడే ‘పాప్ టెస్ట్’ వంటి సాధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సకాలంలో టీకాలు వేయడం, సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. 9-14 ఏళ్ల వయస్సుగల మగ పిల్లలు కూడా కొన్ని తల, మెడ మరియు పురుషాంగ క్యాన్సర్లను నివారించడానికి హెచ్​పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. మరియు ఈ టీకా వారి భవిష్యత్ మహిళా భాగస్వాములకు వైరస్ కలిగించే గర్భాశయ క్యాన్సర్‌ను వ్యాప్తి చేయకుండా చూస్తుంది ”అని వివరించారు.

అనంతరం ఎస్​ఎల్​జీ హాస్పిటల్​ కన్సల్టెంట్​ రేడియేషన్​ అంకాలజిస్ట్​ డాక్టర్​ స్వర్ణకుమారి మాట్లాడుతూ ” ‘‘బ్రెస్ట్​ క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించడానికి స్వీయ పరీక్ష అనేది ఒక సున్నితమైన మరియు ముఖ్యమైన మార్గం. క్యాన్సర్​ వంటి వ్యాధులకు చికిత్స తీసుకునే ముందు స్వీయ అగాహన ఉంటే చికిత్స చేయడం డాక్టర్లకు సులభమవుతుంది. దాంతో పాటు ముందస్తుగా గుర్తించడం వల్ల నివారణ కూడా కష్టం కాదు. బ్రెస్ట్​ క్యాన్సర్, రక్తహీనత, రుతుక్రమ వంటి సమస్యలు మరియు మరికొన్నింటి పరీక్షలు ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలందరూ తమ ఆరోగ్యంపై దృష్టి సారించి నిర్ణీత సమయాల్లో స్వీయపరీక్షలు చేసుకోవాలి. గర్భాశయ క్యాన్సర్ వంటి కొన్ని తీవ్రమైన రోగాలను నివారించడానికి వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి’’. అని వివరించారు.

ఎస్‌ఎల్‌జీ ‘సఖి’ కార్యక్రమంలో భాగంగా, వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం నగర వ్యాప్తంగా వివిధ రెసిడెన్సీ కాలనీలకు వెళ్లి , సందర్శించి మహిళలకు అవగాహన సమావేశాలు నిర్వహించడం, స్వీయ పరీక్షల పద్ధతులు, విధానాలు వివరించడం ఎంతో గొప్ప విషయం.

ఎస్​ఎల్​జీ హాస్పిటల్స్​ గురించి..

ఎస్​ఎల్​జీ ఆస్పత్రి హైదరాబాద్‌లోని నిజాంపేట పరిధిలో బాచుపల్లి వద్ద ఉన్నది. ఇది వివిధ విభాగాల్లో సమగ్రమైన వైద్యసేవలందించేందుకు అవసరమైన అన్ని వైద్య మౌలిక సదుపాయాలతో 999 బెడ్స్​ సామర్థ్యంతో నిర్మించబడింది. ఆస్పత్రి ఆరోగ్య సంరక్షణ విభాగం.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఏర్పాటు చేయబడింది. వ్యక్తిగత లేదా కుటుంబ సమస్యలను గుర్తించడానికి అన్ని వయసుల వారికి స్క్రీనింగ్ కార్యక్రమాలను కూడా చేపడుతోంది.


మీడియా సమాచారం కోసం దయచేసి సంప్రదించండి : గిరి | పీఆర్​ సూత్ర @ 9963445785

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here