SAKSHI RESIDENT EDITOR OUT?
సాక్షి పత్రికలో రెసిడెంట్ ఎడిటర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న ధనుంజయ్ రెడ్డిని ఆ స్థానంలో నుంచి తొలగించారు. అధికారికంగా ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉందని సమాచారం. ఈ నిర్ణయం ఇటీవల జరిగిందని ఆ పత్రిక వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. రెసిడెంట్ ఎడిటర్ అంటే కీలకమైన పదవి. ధనుంజయ్ రెడ్డిని తప్పించడానికి బలమైన కారణాలు ఉన్నాయని సమాచారం. నిజానికి, ఈ పత్రికలో పదవీవిరమణ పొందనివారిని కొనసాగిస్తున్నారు. అలాంటిది, కీలకమైన రెసిడెంట్ ఎడిటర్ గా ఎంతో చిన్నవాడు అయిన అతన్ని తప్పించటం కీలక పరిణామం అయ్యింది. అతన్ని తప్పించటానికి సాక్షి వర్గాల్లో రకరకాల అంశాలు ప్రచారంలో ఉన్నాయనేది తెలిసిందే. తీవ్రమైన ఆరోపణలు రావటంతోపాటు వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చాక పత్రిక అంశాలపై కంటే ఇతర అంశాలపై ధనుంజయ్ ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారని సమాచారం.
చాలాకాలం నుంచి ధనుంజయ్ రెడ్డి వ్యవహార శైలిపై యాజమాన్యం అసంతృప్తితో ఉన్నది. సరిదిద్దుకుంటాడని ఓ ఛాన్స్ ఇచ్చి చూశారు. అయినా, అతని వైఖరిలో మార్పు రాకపోవటంతో రెసిడెంట్ ఎడిటర్ పదవి నుంచి తప్పించారని తెలిసింది. అతన్ని హైదరాబాద్ కు బదిలీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాజా నిర్ణయం వైసీపీ వర్గాలతోపాటు సాక్షి గ్రూపులో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నందు వల్ల పత్రిక సర్కులేషన్ ను సాధ్యమైనంత వరకూ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నది. కీలకమైన ఇలాంటి సమయంలో రెసిడెంట్ ఎడిటర్ వ్యవహారం తలనొప్పిగా మారిందని.. అందుకే, యాజమాన్యం కఠిన నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అంతే కాదు దీర్ఘకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతున్న వాళ్లను కూడా మార్చే అవకాశం ఉందని..త్వరలోనే మరిన్ని కీలక మార్పులు ఉంటాయని చెబుతున్నారు. ఏదీఏమైనా కీలక సమయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ధనుంజయ్ రెడ్డిని తప్పించడాన్ని కొన్ని వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సీఎం జగన్ కు కోపం వస్తే ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటారని అనడానికిదో ఉదాహరణ అని పత్రికవర్గాలు చెబుతున్నాయి.