కథానాయిక సమంత ఎవ్వరూ ఊహించని రీతిలో జబ్బు బారిన పడటం `ఖుషి` సినిమాకి పెద్ద నష్టం చేకూర్చింది.కొన్ని నెలలపాటు ఆ సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది.సినిమాలో చిన్నపాత్రలు చేసిన ఏ నటుడికో సమస్య ఎదురైతే వాళ్ల స్థానంలో మరొకరిని తీసుకుని సినిమా చేయొచ్చు.కానీ నాయకానాయికలకు ఏమైనా అయితే అసలేమీ చేయలేరు.ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం తప్ప.విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న `ఖుషి`కి అదే అనుభవమే ఎదురైంది. హీరోయిన్ సమంత మయోసైటిస్ బారిన పడ్డారు.దాంతో కొన్ని నెలలపాటు ఆమె ట్రీట్‌మెంట్ కొనసాగిస్తూ,విశ్రాంతి తీసుకోవల్సి వచ్చింది.ఈమధ్యే కోలుకుని మళ్లీ మేకప్ వేసుకుంది.కోలుకున్నాకైనా సమంత `ఖుషి` సెట్లోకి వస్తుందనుకుంటే.
బాలీవుడ్‌లో రూపొందిన ఓ వెబ్ సిరీస్ కోసం ఆమె రంగంలోకి దిగింది. దాంతో దర్శకుడు శివ నిర్వాణ గుస్సా అయ్యారట. ఇప్పటికే బోలెడంత ఆలస్యం జరిగింది,ఇంకా మీరు రాకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడట. దాంతో సమంత `ఖుషి` సెట్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. మార్చి 1 నుంచి ఆమె ఈ సినిమా సెట్లోకి అడుగు పెడుతుంది. సో… రౌడీ బిజీ అవుతున్నాడన్నమాట.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అందులో విజయ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.