కోర్టులో అడ్డం తిరిగిన సమత నిందితులు

91
Samatha rape accused
Samatha rape accused

Samatha rape accused produced in fast-track court

మహిళను దారుణంగా హింసించి, వేళ్లను.. చేతుల్ని నరికేసి మరీ గ్యాంగ్ రేప్ చేయటమే కాదు.. ఉన్మాదంతో హత్య చేసిన వ్యవహారం దిశ హత్యాచార ఉదంతానికి కేవలం రెండు రోజుల ముందు జరిగింది.సమత హత్యాచార ఉదంతానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ షురూ అయ్యింది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రామ్‌నాయక్ తండా సమీపంలో ఆదీవాసీ మహిళపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి, హత్య చేసిన నిందితులను గురువారం పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవటంతో కోర్టు రహీం అనే లాయర్ ను ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే తాము నేరం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు కానీ.. తాము నేరం చేసినట్లుగా ఆధారాలు.. సాక్ష్యాలు లేవని.. అందుకు ఈ కేసుల నుంచి తమను విడుదల చేయాలని వారు కోరుకుంటున్నట్లు లాయర్ రహీం తెలిపారు. ఇక కోర్టులో నిందితులు రివర్స్ తిరిగారు . తమకు అసలేం తెలీదని పోలీసులు కావాలని తమను ఈ కేసులో ఇరికిస్తున్నారని వారు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నట్లుగా అసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి ఆధారాలు దాఖలు చేశారు. ఇక కోర్టు ఈ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.

Samatha rape accused produced in fast-track court,#samatha , #asifabad, gang rape, murder, fast track court, adjourned , accused, reverse

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here