కాన్సెప్ట్ ఒక‌టేనా?

Same Concept
కొన్నిసార్లు ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌లు క‌లుస్తాయా?  లేదా వారు ఓకే సినిమాను స్ఫూర్తిగా తీసుకుని క‌థ‌ను త‌యారు చేసుకుంటారేమో  కానీ రెండు సినిమాల‌కు కాన్సెప్ట్ ఒకేలా క‌లుస్తుంటాయి. ఇప్పుడు ర‌వితేజ `డిస్కోరాజా`… స‌మంత `బేబి` సినిమాల కాన్సెప్ట్ ఒకటేన‌ని ఇండ‌స్ట్రీ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. డిస్కోరాజాలో రవితేజ రెండు పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒక పాత్ర పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఆపాత్ర 70 ఏళ్ల‌కు చేరుకుంటుంది. ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి యువ‌కుడిగా ఉన్న ర‌వితేజ‌గా ఎలా మారాడ‌నేదే క‌థాంశమ‌ని టాక్‌. ఇక స‌మంత బేబి సినిమా విష‌యానికి వ‌స్తే 70 ఏళ్ల ముస‌లావిడ పాతికేళ్ల అమ్మాయిగా ఎందుకు మారింది? అనేదే క‌థాంశం. ఇది కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్. ఇందులో వృద్ధురాలి పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మిన‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల కాన్సెప్ట్‌లు విన‌డానికి ఒకేలా ఉన్నాయి. మ‌రి ఇద్ద‌రి ద‌ర్శ‌కులు ఆలోచ‌న‌లు యాదృచ్చికంగా క‌లిశాయా?  లేకుంటే.. ఏమో సినిమాలు విడుద‌లైన త‌ర్వాత‌గానీ తెలియ‌వు అస‌లు విష‌యాలు.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article