సేమ్‌ సజ్జనార్‌… సీన్‌ రిపీట్‌

SAME SAJJANAR.. SCENE REPEAT

దిశా హత్యాచారం తర్వాత ప్రజాగ్రహాం కట్టలు తెంచుకొంది. జనాలు రోడ్డెక్కారు. బాధితురాలికి న్యాయం జరగాలని నినదించారు. నిందితులను ఉరి తీయాలన్నారు. ​కఠినంగా శిక్షించాలన్నారు. చట్టాలు అడ్డుపడితే మాకు అప్పగించండి మేం తాట తీస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత గట్టిగా వినిపించిన మాట ఎన్‌కౌంటర్‌ చేసి ​పారేయాలి. 2008లో వరంగల్‌ యాసిడ్‌ ఎటాక్‌ ఇన్సిడెంట్‌లో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనను గుర్తు చేసి సీన్‌ రిపీట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  ​
ప్రజల డిమాండ్‌కు గౌరవం ఇవ్వాలనుకున్నారో… అనుకోకుండా అలా జరిగిపోయిందో కానీ షాద్‌నగర్‌ ఘటనలో పోలీస్‌లు సైతం నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ​రెండు ఘటనలకు ఉన్న చిన్న కనెక్షన్‌ ఏంటంటే వీసీ సజ్జనార్‌. 2008లో వరంగల్‌లో ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ స్వప్నిక- ప్రణీతపై ముగ్గురు ఆగంతకులు యాసిడ్‌తో దాడి ​చేశారు. ఈ ఘటనలో స్వప్నిక చనిపోగా… ప్రణీత తీవ్రంగా గాయపడి అనేక సర్జరీల తర్వాత గాయం తాలుకూ మచ్చలతో మరణం అంచుల నుంచి బయటపడింది. ​యాసిడ్‌ ఘటనపై అప్పటి ఆంధ్రప్రదేశ్‌ అట్టుడికింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయ్‌. రాజశేఖరరెడ్డి గవర్నమెంట్‌ కూడా కేసును ​సీరియస్‌గా తీసుకొంది. ​
యాసిడ్‌ ఎటాక్‌ తర్వాత వెంటనే నిందితులను అరెస్ట్‌ చేయడం… ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌లో వారిని కాల్చేయడం చకచకా జరిగిపోయాయ్‌. అప్పుడు వీసీ సజ్జనార్‌ వరంగల్‌ ​సూపరిండెంట్‌గా ఉన్నారు. ఆ ఘటనలోనూ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తోన్న సమయంలోనే నిందితులు పారిపోయే యత్నం చేయగా పోలీస్‌లు తమ తుపాకీలకు పని చెప్పక ​తప్పలేదు. ఎన్‌కౌంటర్‌ వార్తతోగానీ జనాల్లో ఆవేశాలు చల్లారలేదు. ఇప్పుడు సజ్జనార్‌ సైబరాబాద్‌ కమీషర్‌గా ఉన్నారు. దిశా హత్యాచారం ఘటనలోనూ ఎన్‌కౌంటర్‌ వార్త ​విన్న వెంటనే అందరిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ్‌. వరంగల్‌ ఘటనని గుర్తు తెచ్చుకొని శభాష్‌ హైద్రాబాద్‌ పోలీస్‌ అంటున్నారు.  సోషల్ మీడియాలో మదమత్సర దుష్టసంహార సజ్జనార్‌ నీకు సాహో అంటూ నెటిజన్స్‌ పొగడ్తలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *