‘ఓదేలు రైల్వే స్టేషన్’కు సంపత్ నందికి సంబంధం ఏంటీ..?

56
sampat nandi
sampat nandi

ఏమైంది ఈ వేళ అనే సినిమాతో దర్శకుడుగా అడుగుపెట్టాడు సంపత్ నంది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఆ సినిమా యూత్ ఫుల కంటెంట్ తో బావుంటుంది కూడా. ఆశ్చర్యంగా ఆ తర్వాత వెంటనే రామ్ చరణ్ ను ఒప్పించాడు. చరణ్, తమన్నా జంటగా రచ్చ చేశాడు. కంటెంట్ పూర్ అయినా కమర్షియల్ గా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఈ ఒక్క హిట్ తోనే నెట్టుకొస్తున్నాడు సంపత్ నంది. రవితేజతో చేసిన బెంగాల్ టైగర్ పోయింది. గౌతమ్ నందా అంటూ గోపీచంద్ ను నిలబెట్టాలనుకున్నా ఉపయోగం లేకపోయింది. మొత్తంగా ఏడేళ్లలో నాలుగు సినిమాలే చేసిన సంపత్ మధ్యలో గాలిపటం, పేపర్ బాయ్ చిత్రాలను నిర్మించాడు కూడా. బట్ ఈ రెండు సినిమాలు కూడా అతనికి పెద్దగా ప్లస్ కాలేదు. నిర్మాతగానూ ఫెయిల్ అయ్యేలా చేశాయి. ప్రస్తుతం గోపీచంద్ తో మరోసారి, తమన్నాతో మూడోసారి అంటూ ‘సీటీమార్’అనే సినిమా చేస్తున్నాడు. కబడ్డీ ఆట నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ఇది. షూటింగ్ చివరి దశలో ఉండగా లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. అక్టోబర్ నుంచి సీటీమార్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

ఈ లోగా సంపత్ నంది మరో సినిమాతో వస్తున్నానని అనౌన్స్ చేశాడు. కాకపోతే దీనికి అతను దర్శకుడు కాదు. తన శిష్యుడు అశోక్ తేజను దర్శకుడుగా పరిచయం చేస్తూ.. తను రాసిన కథ, స్క్రీన్ తో వస్తున్నాడు. టైటిల్ కూడా ఆకట్టుకునేలా ‘ఓదేలు రైల్వే స్టేషన్’అని పెట్టారు. సంపత్ ను ముందు నుంచీ ఎంకరేజ్ చేస్తోన్న కెకె రాధామోహన్ ఈ చిత్రాన్నీ నిర్మిస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. సింహా కీలక పాత్ర చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. టైటిల్ తో పాటు ఫస్ట్ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ గ్రామీణ ప్రాంతపు రైల్వేస్టేషన్ ను తలపిస్తోంది. దూరంగా వెళుతోన్న రైలును చూస్తూ ఓ మహిళ ఎర్ర దుప్పటితో అటువైపు నించుని ఉంది. మొత్తంగా లాక్ డౌన్ టైమ్ లో తను రాసుకున్న కథతో ఏకంగా సినిమా అనౌన్స్ చేశాడు సంపత్ నంది. మరి ఈ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా విజయం నిర్మాతకు కూడా కీలకమైనదే.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here