ఆ ఆఫీస‌రంటే.. క‌విత‌కే కాదు ఎవ‌రికైనా టెర్ర‌ర్‌!

sanjay kumar mishra Terror to anyone

సంజయ్ కుమార్ మిశ్రా 1984 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్. ప్రస్తుత ఈడీ డైరెక్టర్. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ అధికారి ఆర్థిక రంగంలో నిపుణుడు మేధావి. ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ లో అతి పెద్ద కేసులను హై ప్రొఫైల్ కేసులను అత్యంత పకడ్పందిగా విచారించి చట్టం ముందు వారిని దోషులుగా నిల్చోబెట్టి ధీరుడు ఈ అధికారి. ఈ పేరు వింటే చాలు ఆర్థిక నేరగాళ్ల వెన్నులో వనుకే. అనేక ప్రముఖ ప్రొఫైల్ లను అత్యంత చాలా చాకచక్యంగా డీల్ చేసి అన్ని ఆధారాలతో చట్టం ముందర దోషులుగా నిలబెట్టిన అధికారి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ చూసి కేంద్ర ప్రభుత్వం ఈ అధికారిని 2018 నవంబర్ నెలలో ఈడీ డైరెక్టర్ గా నియమించింది. ఎన్నో హిప్రోఫైల్ కేసులు ఉండటం తో కేంద్ర ప్రభుత్వం ఈ అధికారి సేవలను ఈడి డైరెక్టర్ గా పొడిగిస్తూ వస్తోంది.

ఆర్థిక నేరగాళ్ల కు సింహ స్వప్నమైన ఈ అధికారి సేవలను ఈడీ డైరెక్టర్ గా పొడిగిస్తూ రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు తలుపు తడితే ఆ పిల్ ను కోర్టు తిరస్కరించింది. ఇక మీదట ఎక్స్ టేన్షన్ ఇయ్యడానికి వీలు లేదు అని తెలుపుతునే ఈ అధికారి ట్రాక్ రికార్డ్ ను ప్రశంసించింది. కొత్తగా వచ్చే అధికారి వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి సమయం పడుతుంది… పైగా అనేక కేసులు వివిధ దశల్లో ఉన్నాయి అందువల్ల ప్రస్తుత అధికారిని కొనసాగించడం సబబే అని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అధికారి సేవలను పొడిగించడం సబబే అని తీర్పు వెల్లడిస్తూ కాంగ్రెస్ పార్టీ అప్పీల్ ను కొట్టివేసింది.

ఇతన్ని ఈడీ డైరెక్టర్ గా తొలగించాలి అని ప్రాంతీయ జాతీయ పార్టీల నాయకులు మొదలు అనేక మంది ఆర్థిక నేరగాళ్లు ప్రైవేట్ బ్యాంక్ లకు చెందిన ముఖ్య మాజీ అధికారులు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఈ అధికారి ట్రాక్ రికార్డ్ ముందర ఆ కుయుక్తులేవీ పనిచేయలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్డ్ వాద్రా, డీకే శివ కుమార్, హేమంత్ సోరేన్, అనీల్ దేష్ ముఖ్, బుపిందర్ సింగ్ హనీ {(పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ అల్లుడు) ఇసుక మైనింగ్ కేసు} కవిత కల్వకుంట్ల (ఢిల్లీ లిక్కర్ స్కాం), మనీష్ సిసోడియా (ఢిల్లీ లిక్కర్ స్కాం) తృణమూల్ కాంగ్రెస్ మాజీ లీడర్ పార్థ చటర్జీ , అర్పిత ముఖర్జీ SSC నియామక స్కాం, ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మహబూబ ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, ఎస్ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్ రాణా కపూర్, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ & సీఈఓ చంద కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్ ఇలా అనేక ప్రముఖుల కు సంబంధించిన ఆర్థిక నేరాల కేసులను ఇతని ఆధ్వర్యంలో ఈడి అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article