మహేష్ బాబు మనసు దోచాడు భయ్యా ..?

sarkaru vari pata look
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే అంటే ఆయన అభిమానులతో పాటు మహేష్ ఫ్యాన్స్ కు ఓ పండగ. ఆ రోజు మహేష్ తను చేస్తోన్న లేదా చేయాలనుకుంటోన్న ఏ సినిమా గురించైనా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తాడు. ఇది చాలాయేళ్లుగా కొనసాగుతోంది. ఇక ఈ సారి కూడా అనుకున్నట్టుగానే మహేష్ బబు – పరశురామ్ కాంబినేషన్ లో రూపొందే సినిమా అప్డేట్ ఇచ్చారు. ముందే ఊహించినట్టుగా టైటిల్ కూడా ‘సర్కారు వారి పాట’ అనే ఫిక్స్ చేశారు. ఇంకా హీరోయిన్ ఫైనల్ కాని ఈ మూవీకి తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ ఆదివారం ఉదయమే ఫస్ట్ లుక్ వదిలారు. ఈ లుక్ కు ఎంటైర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారనే చెప్పాలి. పోకిరి మూవీ హెయిర్ స్టైల్ తో పాటు మెడపై రూపాయి కాయిన్ టాటూ తో కనిపించాడు. అయితే ఈ వెనింగ్ వరకూ మరో పోస్టర్ కూడా విడుదల చేసింది టీమ్. ఇది ఇంకా సూపర్ అని చెప్పాలి. మహేష్ మెడపై కత్తి పెట్టారు.. అతను మాత్రం అది పట్టించుకోకుండా అటు వైపుకు తిరిగి ఇటు పక్కన ఉన్న మరొకరికి చిటికె వేసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉందీ స్టిల్.
ఈ స్టిల్ తో ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ కు ఏ ఢోకా లేదనేది కూడా తేలిపోయింది. మామూలుగా మొదట్లో ఇదో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకూ అలాంటి సినిమాలే చేసిన పరశురామ్ రూట్ మార్చినట్టున్నాడు. ఫస్ట్ టైమ్ ఓ మాస్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్రభుత్వాలపైన ఓ రేంజ్ లో సెటైర్స్ కూడా ఉంటాయట. గతంలో మహేష్ బాబు చేసిన శ్రీమంతుడులో గ్రామాలను దత్తత తీసుకున్నట్టు, భరత్ అనేనేనులో ముఖ్యమంత్రిగా ట్రాఫిక్ ఛలాన్స్ భారీగా వేసినట్టు, మహర్షిలో రైతుల కోసం పోరాటం చేసినట్టుగా ఇందులోనూ ఓ సోషల్ కాజ్ ఉంటుందని సమాచారం.  ప్రస్తుతం వినిపిస్తోన్నదాన్ని బట్టి.. ఈ మూవీలో అక్రమ మార్గాల్లో టెండర్లు వేసి, అవినీతితో నిర్మించిన కట్టడాల వల్ల సామాన్య జనం అనేక ఇబ్బందులు పడతారట. అందులో మహేష్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. అలాంటి సర్కారువారి పాటల్లోని అవినీతికి వ్యతిరేకంగా ఈ సాధారణ యువకుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందంటున్నారు. మొత్తంగా కంటెంట్ అయితే బలంగానే ఉంటుందని వినిపిస్తోంది. సో.. తెలంగాణ సర్కార్ షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఈ సర్కారు వారి పాట మొదలవుతుంది.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article