సర్కార్ వారి పాట సంబరం

బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట సౌండ్ మొదలైంది.భారీ అంచనాలతో బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ కావడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆతురతగా ఎదురు చేశారు.పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదల కావడం ఆపై మంచి టాక్ ను దక్కించుకోవడంతో మహేష్ అభిమానులు ఫుల్ షుషీ అవుతున్నారు.విశాఖలో విడుదలైన సినిమా ధియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొనవడంతో పండుగ వాతావణం సంతరించుకుంది.హీరోగా మహేష్ బాబుకు 27వ సినిమా. ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్లో విడుదలై దుమ్ము రేపుతోంది.దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. మహేష్ సినిమా అంటే మామూలుగానే అభిమానులు హంగామా చేసే వారు.కానీ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article