చైతు ద‌ర్శ‌కుడితో శర్వా

sarva with chatu director

చైత‌న్య‌తో ప్రేమ‌మ్‌, స‌వ్య‌సాచి వంటి రెండు సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు చందు మొండేటి త‌దుప‌రి సినిమాను శ‌ర్వానంద్‌తో చేయ‌బోతున్నాడు. వివ‌రాల ప్ర‌కారం..రీసెంట్‌గా శ‌ర్వానంద్‌తో `ప‌డిప‌డి లేచె మ‌న‌సు` సినిమా చేసిన నిర్మాత చెరుకూరి సినిమాకు ఆ సినిమా అనుకున్న మేర లాభాల‌ను తెచ్చి పెట్ట‌లేదు. కాబ‌ట్టి నిర్మాత కోసం మ‌రో సినిమా చేయాల‌ని శ‌ర్వానంద్ నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అందులో భాగంగా ఇటీవ‌ల చందు మొండేటి చెప్పిన క‌థ‌కు ఓకే చెప్పేశాడ‌ట‌. అయితే ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ‌తో సినిమా చేస్తోన్న శ‌ర్వానంద్ త‌దుప‌రి `96` రీమేక్‌లో న‌టిస్తాడు. త‌ర్వాతే శ‌ర్వానంద్‌, చందు మొండేటి సినిమా ఉంటుంది.

Check Out Latest Offers in Amazon

For more Filmy News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article