మహా సముద్రం కదులుతోందా..?

45
sarvanand movie
sarvanand movie

sarvanand movie

ఆర్ఎక్స్ 100.. టాలీవుడ్ లో మినీ బడ్జెట్ లో మాగ్జిమం సందడి చేసిన సినిమా. కంటెంట్ పరంగా సూపర్బ్ అనిపించుకుని కమర్షియల్ గానూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో అజయ్ భూపతి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. దర్శకుడుగా అతని కేపబిలిటీ తొలి సినిమాకే తెలిసింది. ఆ టైమ్ లో ఏకంగా కొందరు కోలీవుడ్ స్టార్స్ కూడా అజయ్ తో సినిమా చేయాలనుకున్నారు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా తర్వాత అతను ప్లాన్ చేసుకున్నమహాసముద్రం మాత్రం అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది.
ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ చేయాలనుకున్న మహాసముద్రం కథ చాలామంది హీరోల వద్దకు వెళ్లింది. అంతా బావుందున్నారు కానీ ఎవరూ ఓకే చప్పలేదు. ఫైనల్ గా శర్వానంద్ వద్ద ఆగింది. అయితే శర్వా చేస్తున్నాడా లేదా లేక ఇతర హీరోల్లాగానే హ్యాండ్ ఇస్తాడా అనే అనుమానాలూ ఉన్నాయి. బట్.. ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంటే వచ్చింది. పైగా శర్వా కూడా చెప్పడంతో ఇక మహాసముద్రంకు సడెన్ గా హైప్ వచ్చేసింది.

శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శర్వా ఇమేజ్ కు ఈ కథ అద్భుతంగా సెట్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. త్వరలో శ్రీకారం విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ అంత హైప్ లేదా సినిమాపై. ఓ తమిళ్ మూవీకీ సైన్ చేశాడు. అయితే మహా సముద్రం కూడా తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదలవుతుందట. ఇది అజయ్ భూపతికి ఊహించని ప్లస్ పాయింట్. త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ను కూడా అనౌన్స్ చేసి అక్టోబర్ నుంచే షూటింగ్ వెళ్లాలనే ప్లానింగ్ లో ఉన్నారట. మరి ఈ మహాసముద్రంతో  శర్వా, అజయ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here