నేను కేటిఆర్ కు పెద్ద ఫ్యాన్

Sathyavathi Rathod Ktr Fan

పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకునే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన / ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మీకోసం / పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ లోని తన నివాసంలో పరిసరాలను తన మనవరాలు, కుటుంబ సభ్యులతో కలిసి పరిశుభ్రం చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. పూల కుండీలలో నిలువ నీటిని, దర్వాజలకు ఎండుటాకులు తీసేశారు. ఇంటి టెర్రేస్ మీద కూడా చెత్త, చెదారాన్ని పరిశుభ్రం చేశారు. ఆమె ఏమన్నారంటే..

నేను కేటిఆర్ కి పెద్ద ఫ్యాన్ ను. రోజూ నేనే ఇంట్లో క్లీనింగ్ చేస్తాను. మొక్కలకు నీరు పోస్తాను. మా ఇంట్లో కావాల్సిన ఆకుకూరలు పండిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెరగాలి, పరిశుభ్రంగా ఉండాలి. కరోనాను కట్టడి చేయాలంటే పరిశుభ్రత, పచ్చదనం చాలా ముఖ్యం. దీనితో పాటు భౌతిక దూరం పాటించాలి. మా ఇంట్లో గార్డెనింగ్ చేసుకున్నాం. ఈరోజు మొక్కల కుండీలలో నీరు తీసి మంచి నీరు పోశాం. ఇలాంటి మంచి పనికి అందరూ సహకరించి, భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు 10 నిమిషాలు కుటుంబాల కోసం పరిసరాల పరిశుభ్రత కు కేటాయించాలి. పట్టణ ప్రగతి తర్వాత మహబూబాబాద్ చాలా మార్పు వచ్చింది. ఈ ఏడాది పట్టణ ప్రగతి తర్వాత మరింత మార్పు మహబూబాబాద్ లో కనిపిస్తుంది.

Telangana DryDay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *