satya dev death sentiment in movies
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభావంతమైన నటుల్లో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. కానీ అతని ప్రతిభను కరెక్ట్ గా చూపించే అవకాశం పెద్దగా రావడం లేదు. బ్లఫ్ మాస్టర్ లాంటి సినిమాల్లో సత్తా చాటినా.. హీరోగా కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవు. కారణాలు కరెక్ట్ గా చెప్పలేం కానీ.. సత్యదేవ్ లో హీరోయిజం కనిపించడం లేదో.. లేక అతన్ని హీరోగా పెడితే ఎవరు చూస్తారు అనే భావమో కానీ.. తెలుగు సినిమాల్లో అతన్ని కేవలం పాత్రలకే పరిమితం చేశారు. పోనీ ఆ పాత్రలైనా గొప్పగా ఉంటున్నాయా అంటే లేదు. ఏదో త్యాగరాజు తరహా లేదంటే అతను చనిపోవడం.. అన్నట్టు ఈ మధ్య ఈ సెంటిమెంట్ కూడా బలపడుతోంది. సత్యదేవ్ పాత్ర చనిపోతే సినిమా హిట్ అంటున్నారు. నిజమే.. లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ లో కూడా అతని పాత్ర చనిపోతుంది. సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమాలోనూ అతని పాత్ర చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతూ.. హీరోకు హీరోయిజం చూపించే ఛాన్స్ ఇస్తుంది. కట్ చేస్తే ఆఖర్లో అతను పోతాడు.. మళ్లీ కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.
సత్యదేవ్ లాంటి ఆర్టిస్టులు రేర్ గా ఉంటారు. కానీ ఈ తరహా మూస పాత్రల్లోకి వెళ్లిపోతే అతని కెరీర్ ముగిసిపోవడానికి ఎక్కువ సినిమాలేం పట్టవు. అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో సత్యదేవ్ పాత్ర చనిపోతుంది. అది ఖచ్చితంగా అతని కెరీర్ కు అంత మంచిది కాదు. కొన్నాళ్లకు ఈ తరహా పాత్రలు మాత్రమే అతని వరకూ వెళతాయి.
ప్రస్తుతం హీరోగా మరో సినిమా చేస్తున్నాడు సత్యదేవ్. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా చేస్తోన్న సినిమా అది. బాహుబలి నిర్మాతలు నిర్మిస్తున్నారు. మళయాలంలో బ్లాక్ బస్టర్ అయిన ‘మహేశింతే ప్రతీకారమ్’ అనే చిత్రాన్ని.. తెలుగులో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అంటూ తీస్తున్నారు. మరి ఈ సినిమా అయినా అతనికి హీరోగా కాకపోయినా నటుడుగా పెద్ద బ్రేక్ ఇస్తుందా అనేది చూడాలి.