ఉమామహేశ్వరరావు దూకుడు మామూలుగా లేదే..

15
satyadev movie update
satyadev movie update

satyadev movie update

చాలా అంటే చాలా చిన్న పాత్రతో పరిచయమైన నటుడు సత్యదేవ్. ఆ తర్వాత అడపాదడపా అలాంటి పాత్రల్లోనే కనిపించాడు. కానీ అతన్లో ఓ స్పార్క్ ఉంది. అది ముందుగా గమనించింది పూరీ జగన్నాథ్. అందుకే తన జ్యోతిలక్ష్మి సినిమాలో పెద్ద వేషం ఇచ్చాడు. అవకాశాన్ని వాడుకున్నాడు. ప్రకాష్ రాజ్ లాంటి నటుడుని కూడా మెప్పించి ఆయన నిర్మించిన మనవూరి రామాయనంలో కీలక పాత్ర చేశాడు. అలా మెల్లగా ఎదుగుతూ వచ్చిన సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ సినిమాలో చెలరేగిపోయాడు. అయినా కేవలం హీరో అనే లిమిట్స్ పెట్టుకోకుండా ఇస్మార్ట్ శంకర్, బ్రోచేవారెవరురా వంటి సినిమాల్లోనూ కీలక పాత్రలు చేశాడు. మొత్తంగా ఈ యేడాది ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్ రీసెంట్ గానే తమన్నా హీరోయిన్ గా సినిమా అనౌన్స్ అయింది. ఓ కన్నడ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఆ సినిమా పేరు ‘గుర్తుందా సీతాకాలం’.

ఈ సినిమా ఇంకా సెట్స్ లోకి వెళ్లకుండానే లేటెస్ట్ గా మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఏకంగా టైటిల్ తో అనౌన్స్ అయిందీ మూవీ. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమాకు ‘తిమ్మరుసు’అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. సృజన్ ఎరబోలు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. పోస్టర్ లో న్యాయస్థానంలో కళ్లకు గంతలతో త్రాస్ పట్టుకున్న న్యాయదేవత ఫోటో కనిపిస్తోంది. అంటే సినిమాలో సత్యదేవ్ న్యాయం కోసం మాత్రమే నిలబడి.. ఖచ్చితమైన తీర్పులు ఇచ్చే లాయర్ పాత్రలో కనిపిస్తాడని చెప్పకనే చెప్పారు. ఏదేమైనా ఈ పోస్టర్ తో పాటు టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతాం అని చెబుతున్నారు. మొత్తంగా సత్యదేవ్ దూకుడు మామూలుగా లేదనే చెప్పాలి. సాధారణ పాత్రలో వచ్చిన కుర్రాడు కాస్తా తన హార్డ్ వర్క్ తో ఇలాంటి స్టేజ్ కు వెళ్లాడు. చూస్తోంటే రాబోయే రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన కథలకు సత్యదేవ్ మాత్రమే బెస్ట్ ఆప్షన్ గా మారేలా ఉన్నాడు. మరి ఈ దూకుడుకు తోడు మంచి విజయాలు కూడా వస్తే సత్యదేవ్ కు కమర్షియల్ స్టార్డమ్ కూడా వస్తుంది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here