సత్యదేవ్-తమన్నా.. జంట భలే కుదిరిందే..?

41
satyadev-tamanna pair
satyadev-tamanna pair

satyadev-tamanna pair

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న నటుల్లో సత్యదేవ్ ఒకడు. సరైన బ్రేక్ పడటం లేదు కానీ మనోడిలో మంచి నటుడున్నాడని అందరూ ఒప్పుకుంటారు. అయితే కేవలం హీరో అనే కాకుండా ఏ పాత్రైనా చేస్తూ వెళుతోన్న సత్యదేవ్.. ప్రస్తుతం గతంలో మళయాలంలో సూపర్ హిట్ అయిన ‘మహేశింతే ప్రతీకారమ్’కు రీమేక్ గా వస్తోన్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో హీరోగా నటిస్తున్నాడు. పూర్తిగా అరకు వ్యాలీ పరిసరాళ్లో షూటింగ్ జరుపుకుందీ చిత్రం. విశేషం ఏంటంటే.. ఈ రీమేక్ ను ‘కేరాఫ్ కంచరపాలెం’దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించాడు. నిర్మాత కూడా ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రవీణనే. అంతకంటే విశేషం ఏంటంటే.. బాహుబలి నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ భాగస్వామ్యం అయ్యారు. థియేటర్స్ లో చూడాల్సిన ఈ సినిమా కాస్తా.. ఇప్పుడు ఓటిటిలో విడుదలవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత సత్యదేవ్ హీరోగా తమన్నా హీరోయిన్ గా ఓ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఇది కూడా రీమేకే.

కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టెయిల్’ చిత్రాన్ని ఈ ఇద్దరూ జంటగా తెలుగులో రూపొందించబోతున్నారు. ఇది కంప్లీట్ గా రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగని వల్గారిటీ ఉండదు. అర్బన్ ఆడియన్స్.. ఇంకా చెబితే మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చే అంశాలున్న చిత్రం. మరి తెలుగులో ఈ మేరకు ఆకట్టుకుంటుందో కానీ.. ఇక్కడ నాగశేఖర్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించబోతున్నాడు. సెప్టెంబర్ లో చిత్రీకరణ మొదలుపెడతారు అంటున్నారు. ఏదేమైనా సత్యదేవ్, తమన్నా అనే జంటే ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అవుతుందని మాత్రం చెప్పొచ్చు. మరి ఈ మూవీతో సత్యదేవ్ బ్రేక్ తెచ్చుకుంటాడా..?

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here