Sunday, April 6, 2025

చెక్ బౌన్స్ కోసుల్లో ఇకపై జైలుకు వెళ్లాల్సిన పని లేదు

కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు

భారత్ లోని అన్ని కోర్టుల్లో చెక్ బౌన్స్‌ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసుల పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశ న్యాయ వ్యవస్థపై భారాన్నిపెంచుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సుప్రీం కోర్టులో చెక్ బౌన్స్ కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ఓ సలహాను ఇచ్చింది.

శనివారం చెక్ బౌన్స్ కేసును విచారించిన అమానుల్లా ధర్మాసనం ఈ కేసులో నిందితుడైన కుమారస్వామి అనే వ్యక్తికి క్రింది విధించిన శిక్షను రద్దు చేసింది. చెక్ బౌన్స్ విషయంలో ఇరువర్గాల మధ్య పరిష్కార ఒప్పందం కుదిరిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఫిర్యాదు చేసిన వ్యక్తికి అవతలి వ్యక్తి 5.25 లక్షలు చెల్లించడంతో కేసు పరిష్కారం అయ్యింది.

 

ఈ క్రమంలో చెక్ బౌన్స్‌ కేసులు కోర్టులలో భారీగా పెండింగ్‌లో ఉన్న సంగతిని గుర్తు చేసింది ధర్మాసనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కేసుల పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని చెప్పింది. చెక్ బౌన్స్ కేసుల్లో శిక్షించే మార్గంపై దృష్టి పెట్టకుండా.. ఇరు పక్షాలు సుముఖంగా ఉంటే చట్టపరిధిలో సెటిల్మెంట్లను ప్రోత్సహించేందుకు న్యాయస్థానాలు కృషి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

చట్టబద్ధంగా రాసుకున్న అన్ని రకాల ప్రామిసరీ నోట్లలో వివాదాలు తలెత్తినప్పుడు కేసుల పరిష్కారంలోను సెటిల్మెంట్లను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. చెక్కు బౌన్స్ కావడం అనేది రెగ్యులేటరీ నేరమని చెప్పిన సుప్రీం కోర్టు.. ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే నేరంగా పరిగణించబడుతుందని అభిప్రాయపడింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com