సాగర్లో.. ఎస్సీ, ఎస్టీ ఓట్లు కీల‌కం

38
NagarjunaSagarByeElections
SC, ST VOTES CRUCIAL IN NAGARJUNA SAGAR

SC, ST VOTES CRUCIAL IN NAGARJUNA SAGAR

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 19 వేల 745 ఓటర్లున్నారు. వీళ్ళలో లక్షా 8 వేల 907 మంది పురుషులు కాగా, లక్షా ఒక వేయి 838 మంది మహిళా ఓటర్లున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలున్నాయి. గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి, మడుగులపల్లి, నిడమనూరు, అనుముల, త్రిపురారం మండలాల పరిధిలో నాగార్జునసాగర్ నియోజకవర్గం విస్తరించి వుంది.

గుర్రంపొడు మండలంలో మొత్తం 34 వేల 622 మంది ఓటర్లున్నారు.
పెద్దవూర మండలంలో ఓట్లు 44 వేల 658.
తిరుమలగిరి మండలంలో  31 వేల 431 మంది ఓటర్లున్నారు.
అనుముల మండలంలో  ఓట్లు 33 వేల 753.
నిడమనూరు మండలంలో  ఓట్లు 34 వేల 214 వున్నాయి.
మడుగులపల్లి మండలంలోని పది గ్రామాలు సాగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
ఈ గ్రామాలన్నింటిలో కలిపి 7 వేల 225 ఓట్లున్నాయి.
త్రిపురారం మండలంలో  33 వేల 842 మంది ఓటర్లు.

నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా వెనుకబడిన తరగతుల వారి ఓట్లు కనిపిస్తున్నాయి.

  • నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య లక్షా 5 వేల 495 మంది వున్నారు. వీరిలో యాదవ ఓటర్ల సంఖ్య 34 వేల 267. బీసీ ఓటర్లలో 2 వ స్థానంలో ముదిరాజుల ఓట్లు 12 వేల 721, 3 వ స్థానంలో గౌడ కులస్తులు ఓట్లు 9 వేల 948 వున్నాయి. ముస్లిం మైనార్టీల ఓట్లు 8 వేల 115, రజక సామాజికవర్గం ఓట్లు 7 వేల 896, మున్నూరు కాపుల ఓట్లు 6 వేల 515, కమ్మరి, వడ్ల కులస్తులు 5 వేల 328, కుమ్మరులు 5 వేల 258, వడ్డెరలు 5 వేల 557, పద్మశాలీలు 2 వేల 172, పెరిక కులస్తులు 2 వేల 889, నాయీ బ్రాహ్మణ కులస్తులు 2 వేల 291, బలిజలు 1,164, కంసాలిలు 828, మేర కులస్తులు 546 మంది వున్నారు.
  • ఎస్సీ ఓటర్ల సంఖ్య 37 వేల 671 మంది. వీళ్ళలో మాదిగలు 26 వేల 204, మాలలు 9 వేల 698, బైండ్ల కులస్తులు 617, దాసరులు 669, బుడగ జంగాలు 483 మంది వున్నారు. ఎస్టీల సంఖ్య 40 వేల 398. అందులో లంబాడీలు 38 వేల 332 మంది, ఎరుకలులు 2వేల 66 మంది వున్నారు.
  • నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓసీ ఓటర్ల సంఖ్య 31 వేల 385. ఇందులో రెడ్లు అధికంగా 23 వేల 472 మంది ఉన్నారు. వైశ్యులు 3 వేల 517 మంది, కమ్మ కులస్తులు 2 వేల 736 మంది, వెలమలు పన్నెండు వందల 72 మంది, బ్రాహ్మణులు 334 మంది, కరణాలు154 మంది వున్నారు.

 

Nagarjuna Sagar Bye Election Live

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here