100 కోట్లకు టోకరా పెట్టిన విజ్డమ్ జాబ్స్ పోర్టల్

Wisdom Jobs 100 crores Cheating Scam

నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఒక జాబ్స్ పోర్టల్ సంస్థ ఏకంగా 100 కోట్లకు టోకరా పెట్టింది. ఈ దేశంలోనే కాదు విదేశాల్లో సైతం ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమ వెబ్ సైటులో నమోదు చేసుకోవాలని ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రుసుము చెల్లించాలని సూచించిన సంస్థ 3 కోట్లమంది నిరుద్యోగులను నిలువునా ముంచింది. ఉద్యోగం లేదు సరికదా ఉద్యోగం కోసం వారి వద్దనుండి డబ్బులు వసూలు చేసింది. చివరకు బోర్డు తిప్పేసింది.

హైదరాబాద్‌లో ఓ భారీ మోసం వెలుగు చూసింది. నిరుద్యోగ యువతీ యువకుల నుంచి 100 కోట్లు వసూలు చేసిన ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు సంస్థ యజమానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజ్డమ్ పోర్టల్ నిరుద్యోగులను టార్గెట్ చేసుకుంది. తమకు 4000 మంది విదేశీ క్లయింట్స్ ఉన్నారనీ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ఈ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు. వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు నగదును కట్టారు. ఈ సంస్థకు డబ్బులు కట్టిన ఓ వ్యక్తి తనకు ఎంతకీ ఉద్యోగం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలో దిగిన పోలీసులు సంస్థ యజమానిని అరెస్ట్ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article