స్కూల్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

SCHOOL BUS ACCIDENT IN GUNTUR

  • గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో ఘటన

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించడంతో ఓ స్కూల్ బస్సు వాగులో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ కి చెందిన స్కూల్ బస్సు ఎప్పటిలాగే విద్యార్థులను తీసుకుని సోమవారం ఉదయం పాఠశాలకు వెళుతోంది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది వాగు వద్దకు వచ్చేసరికి ఎదురుగా మరో వాహనం రావడంతో డ్రైవర్ వెంటనే తన బస్సును పక్కకు తిప్పాడు. దీంతో బస్సు కల్వర్టు పైనుంచి వాగులో పడిపోయింది. దీంతో బస్సులోని 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తమ పిల్లలు ప్రయాణిస్తున్న స్కూల్‌ బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన పిల్లలను తరలించిన ఆస్పత్రికి చేరుకొని.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. బస్సు కండీషన్‌, డ్రైవర్‌ తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article