స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు చిన్నారుల దుర్మరణం

school bus accident, two children dead

వేములవాడ ఆర్టీసీ బస్ డిపో సమీపంలో స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. పాపం అభంశుభం తెలియని ఇద్దరు చిన్నపిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని కరీంనగర్ హాస్పటల్ కు తరలిస్తున్నారు. తమ పిల్లలు స్కూలు నుంచి తిరిగి ఇంటికొస్తారని ఆశించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. దీంతో, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు తల్లిదండ్రుల ఆర్తనాదాలతో దద్ధరిలిపోతున్నాయి. మరికొద్ది సేపట్లో ఏక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి మంత్రి ఈటెల చేరుకోనున్నారు.  వార్త తెలియగానే ఆయన కలెక్టర్, ఎస్పీ లతో ఫోన్ లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ హాస్పిటల్ వర్గాలతో మాట్లాడి వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరిన మంత్రి. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు పిల్లల్లో ఒకరు మానస్విని వట్టిమూల గ్రామం మరియు బాల్కొండ నియోజకవర్గం మానాల గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు గుగులోత్ దీక్షిత,గుగులోత్ రిషి(2 వ తరగతి) ఉన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article