హిల్స్ ప్యారడైజ్ స్కూలే నా కుమారుడని పొట్టన పెట్టుకుంది

హోం మంత్రి తానేటి వనితకు విన్నవించిన బాధిత కుటుంబం

ఆగిరిపల్లి ఎస్ఐ బెదిరించి తెల్ల కాగితంపై సంతకం పెట్టించారని ఫిర్యాదు

ఎస్ హిల్స్ ప్యారడైజ్ స్కూల్ యాజమాన్యంపై చర్యలకు మంత్రి ఆదేశాలు

విజయవాడ:- ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హిల్స్ ప్యారడైజ్ స్కూల్ లో విద్యార్థి మరణించిన ఘటనలో, బాధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కు అక్కడ జరిగిన వివరాల పై ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం ఐరన్ యార్డ్ ప్రాంతానికి విచ్చేసిన హోం మంత్రి తానేటి వనితను కలిసిన బాధిత కుటుంబ సభ్యులు.హిల్స్ ప్యారడైజ్ స్కూలే నా కుమారుడని పొట్టనపెట్టుకున్నది అని, ఈ ఘటనలో అనేక అనుమానాలు ఉన్నాయని, తమని బెదిరించి భయపెట్టి, ఆగిరిపల్లి ఎస్ఐ చంటిబాబు తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఆ ఎస్ ఐ కి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని అయితే హిల్స్ ప్యారడైజ్ స్కూల్లో నా బిడ్డను చంపేశారని మెడపై ఘాట్లు ఉన్నాయని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, హోం మంత్రికి ఫిర్యాదు రూపంలో తెలియజేశారు. ఫిర్యాదు అందుకున్న హోంమంత్రి ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కు తెలియజేశారు. వెల్లంపల్లి సైతం ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. బాధితులకు అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article