Tuesday, May 13, 2025

కాలి బుడిదవుతున్న కాలిఫోర్నియా అడవులు

24 గంటల్లో 3.5 లక్షల ఎకరాల అడవి దగ్దం

అమెరికాలోని కాలిఫోర్నియా అడవులు పెద్గ ఎత్తున తగలబడిపోతున్నాయి. దీంతో అగ్ర రాజ్యం సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాలిఫోర్నియా నార్త్ ఫారెస్ట్ లో చెలరేగిన మంటల వ్యాప్తి అంతకంతకు ఎక్కువవుతోంది. కేవలం ఒక వ్యక్తి చిన్న తప్పిదంతో ఉత్తర కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఈ కార్చిచ్చు అడవి మొత్తం శర వేగంగా విస్తరిస్తోంది. ఈ మంటలు గంటకు 20 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అడవిని కాల్చేసున్నాయని అధికారులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల సమయంలో భారీ విస్తీర్ణంలో అడివి బూడిదైందని తెలిపారు.

కాలిఫోర్నియాలోని ఈశాన్య చికో సమీపంలో సుమారు 3.5 లక్షల ఎకరాల అడవి తగలబడిపోయింది. దీంతో కాలిఫోర్నియాలోని బుట్టె, టెహమ్మా కౌంటీల్లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు గవర్నర్ గవిన్ న్యూసమ్ తెలిపారు. అడవిలో మంటలను ఆర్పడానికి సుమారు 2వేల మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మొత్తం 16 హెలికాప్టర్ల సాయంతో అడవిలోని మంటలపై నీటిని కుమ్మరిస్తున్నా ఏ మాత్రం ఫలితం లేదని అధికారులు వాపోతున్నారు.

తాజా పరిణామాల నేపధ్యంలో సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. 2018 లో ఇదే ప్రాంతంలో వ్యాపించిన కార్చిచ్చులో 80 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. కాలిపోతున్న కారును ఓ వ్యక్తి అడవిలోకి దొర్లించడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. విచారణ చేపట్టిన కాలిఫోర్నియా పోలీసులు రొన్నై డీన్ స్టౌట్ 2 అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com